వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో 39 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఫిబ్రవరి 8తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ ఖాళీలలో సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగి ఉండాలి. ఎంపికైన వారికి రూ.50వేలకు పైగా జీతం లభించనుంది.