కామని మల్లేష్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా నియామకం

హనంకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన కామని మల్లేష్ పద్మశాలి సంఘం హనంకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పద్మశాలి సోదరుల సంక్షేమానికి, అభివృద్ధికి సంఘం బలోపేతానికి కృషి చేస్తానని ఆదివారం ఆయన తెలిపారు. మడికొండ పద్మశాలి సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మల్లేష్‌ను గడ్డం భాస్కర్, బిల్లా రవీందర్, తొట్ల రాజు యాదవ్, పోతరాజు ప్రకాష్, సత్యనారాయణ, రమేష్, సురేష్ తదితరులు శాలువాలతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕