కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ మెస్‌లో ఆహార నాణ్యత క్షీణించడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వడ్డించిన ఉప్మాలో పురుగులు కనిపించడంతో క్యాంపస్‌లో కలకలం రేగింది. మెస్ నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు నిరసన తెలిపారు. నాణ్యత లేని, అపరిశుభ్రమైన ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు చెలగాటమాడుతున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు.