రుద్రమ నగరంలో కూచిపూడి నృత్యాలు

వరంగల్ నగర రంగశాయిపేటలోని రుద్రమ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో సోమవారం రోజున ఎన్. సి. ఎన్ కళాక్షేత్రం బృందంచే కూచిపూడి నృత్యాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రుద్రమ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కలిసి విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. కార్యక్రమంలోనాట్య గురువు కొనతం వెంకటేశ్వర్లు నాట్య ప్రదర్శన చేసిన విద్యార్థులు సాన్వి, లక్ష్మి, స్నిగ్ధ, హసిని, భవిశ్య, చైత్ర, కాత్యాయాని, సన్మహి, శ్రీసంహిత, శ్రీనిది, దివ్య, సాన్వి, సంయుక్త, రుద్రమ నగర్ గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు పి. హనుమంతరావు, వేణుగోపాల్, లక్ష్మీనారాయణ, బత్తుల సుదర్శన్, వెంకన్న, బోడ కృష్ణ, దేవేందర్, మహేందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕