సుస్థిర వ్యవసాయంపై రైతులకు కేవీకే మామునూరు అవగాహన

కేవీకే మామునూరులో మంగళవారం క్షేత్ర సంరక్షణ అభియాన్ (రబీ 2026), జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 126 మంది రైతులు పాల్గొన్నారు. నేల ఆరోగ్యం, ప్రకృతి వ్యవసాయం, ఎరువుల సమతుల్య వినియోగంపై సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్ జ్యోతి దిశానిర్దేశం చేశారు. డ్రోన్ ద్వారా పురుగుమందుల పిచికారీని ప్రత్యక్షంగా ప్రదర్శించి, పశుగ్రాస యాజమాన్యంపై డాక్టర్ విజయ్ భాస్కర్ అవగాహన కల్పించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటించాలని నిపుణులు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕