వరంగల్ బల్దియాలో నేడు చివరి సమావేశం

వరంగల్ మేయర్ గుండు సుధా రాణి అధ్యక్షతన బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ చివరి సమావేశం జరగనుంది. ఐదేళ్ల పదవీకాలం ముగింపు దశలో ఉన్న ఈ చివరి కౌన్సిల్ నిర్వహణపై సభ్యుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ సమావేశంలో డివిజన్కు రూ. 50 లక్షల నిధుల కేటాయింపులు, పరిపాలన, ఆర్థిక స్వావలంబన కోసం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. అయితే, ఎజెండా అంశాలను అత్యంత గోప్యంగా ఉంచారు.

సంబంధిత పోస్ట్