రాష్ట్రం కోసం న్యాయవాదులు ముందుండి కొట్లాడారు.. మాజీ ఎంపీ

కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా, 4వ రోజున తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో న్యాయవాదులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అప్పట్లో న్యాయవాదులు ముందుండి పోరాడారని తెలిపారు.

సంబంధిత పోస్ట్