ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మడికొండ, నెహ్రూ నగర్, 64వ డివిజన్లోని ఎస్టీ కాలనీలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. గత 80 ఏళ్లుగా సరైన డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు ఇళ్ల మధ్య నిలిచిపోవడంతో ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ దశాబ్దాల డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.