ఏప్రిల్ 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ 134వ జయంతి సభ గోడపత్రికలను ఆవిష్కరించారు.