ధర్మసాగర్ మండలం ముప్పారం తాటివనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తాటిచెట్లకు అంటుకున్న మంటలు గాలి తీవ్రతతో చుట్టుపక్కల పొలాల్లోకి వ్యాపించాయి. సీఐ శ్రీధర్రావు, స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే రైతుల వ్యవసాయ మోటార్లు, పైపులు, గడ్డికట్టలు కాలిపోయాయి. ఈ ప్రమాదంతో భారీ నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.