మల్టీ లెవెల్ సైంటిఫిక్ పార్కింగ్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి

హనుమకొండలోని అశోక్ టాకీస్ ఎదురుగా మునిసిపల్ స్థలంలో రూ. 15 కోట్ల వ్యయంతో మున్సిపల్ ఎస్పీవీ నిధులతో నిర్మించనున్న మల్టీ లెవెల్ సైంటిఫిక్ పార్కింగ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, నాలుగు అంతస్తులతో నిర్మించనున్న ఈ ఆధునిక పార్కింగ్‌లో ఒకేసారి 100 కార్లు, 100 టూ వీలర్స్ పార్క్ చేసుకోవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్