అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించిన మంత్రి సీతక్క

హనుమకొండలోని రెడ్డి కాలనీలో ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న బాలిక రిషితను మంత్రి సీతక్క పరామర్శించారు. మంత్రి సీతక్కతో సెల్ఫీ దిగాలని ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఇంటికి వెళ్లారు. మంత్రి మాట్లాడుతూ నాలుగు కోట్ల మందిలో ఒకరికి వచ్చే వ్యాధి అని బాలికకు కంటిచూపు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. కొనిదెల ఉపాసనకు చెందిన బ్లైండ్ స్కూల్ లో చదువుకుంటుందని ఉపాసనను కూడా చూడాలని బాలిక కోరికను ఉపాసనకు చేరవేసి కలిసేలా చూస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిమ్స్ లో ఉచిత చికిత్స అందేలా చూస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕