అంబేడ్కర్ సచివాలయంలో, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హరీష్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. దేవాలయంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, యాత్రికుల సౌకర్యాల మెరుగుదల, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించి, పనులను వేగవంతం చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు.