వరంగల్ పరిధిలోని వేయి స్తంభాల గుడి, ఫోర్ట్ వరంగల్ ను సందర్శించేందుకు హైదరాబాద్ నుండి వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు హనుమకొండకు సాయంత్రం చేరుకుంటారు. నేరుగా హరిత కాకతీయ హోటల్ కు బుధవారం సాయంత్రం 4: 35 గంటలకు చేరుకుంటారు. వారికి అక్కడ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ, సంగీత వాయిద్యాలతో ఘనంగా స్వాగతం ఉంటుంది. 5: 25 గం. వేయిస్తంభాల గుడికి, 6: 25 గంటలకు ఫోర్ట్ వరంగల్ కు బయల్దేరతారు.