వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదివారం, ఉమ్మడి వరంగల్ జిల్లా, వరంగల్ (వెస్ట్)లోని మడికొండ సోషల్ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, విద్యార్థుల భోజన నాణ్యత, మెడికల్ కిట్స్ గురించి ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ఉపాధ్యాయులు వారిలో నైపుణ్యాలను వెలికితీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.