ఉమ్మడి వరంగల్ జిల్లా, కాజీపేట మండలం మడికొండలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు పాల్గొన్నారు. ఆయన పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని తల్లిదండ్రులకు సూచించిన ఆయన, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.