తప్పైతే రాజీనామా చేస్తా అని సవాల్ విసిరిన ఎమ్మెల్యే నాయిని

తెలంగాణ అసెంబ్లీలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ పాలనలో వేల కోట్ల అవినీతి చేసినవారు ఇప్పుడు దొంగలంటూ ఆరోపించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. BRS నాయకులు సుమారు 200 కోట్ల అక్రమ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించిన ఆయన, ఈ వ్యవహారంపై వెంటనే CBI, CID దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ అవసరమని స్పష్టం చేశారు. తన ఆరోపణలు తప్పని నిరూపితమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నాయిని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్