భారత మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, సంస్కరణల రూపశిల్పి పాములపర్తి వెంకట నరసింహారావు 105వ జయంతి సందర్భంగా హనుమకొండలోని కొత్త బస్టాండ్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామి రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అజిజ్ ఖాన్, మాజీ శాసనసభ్యులు సతీష్, రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈ. వి శ్రీనివాస్, పివి మదన్ మోహన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.