ఆదివారం పరకాల పట్టణ కేంద్రంలోని ఆర్ ఆర్ గార్డెన్ నందు నిర్వహించిన మాదిగకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దళితులు ఎప్పుడూ కాంగ్రెస్ వైపే ఉన్నారని, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గడిచిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేశారని తెలిపారు.