త్వరలో వరంగల్‌కు మహమ్మద్ సిరాజ్

భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ త్వరలోనే వరంగల్ నగరాన్ని సందర్శించనున్నట్లు అభిమానులకు హామీ ఇచ్చారు. కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన 'వరంగల్ వారియర్స్' జట్టు పరిచయ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. టీజీ-20 టోర్నీలో వరంగల్ వారియర్స్ జట్టు తరఫున ఆడటం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కొన్ని వ్యక్తిగత పనుల వల్ల ఈ కార్యక్రమానికి నేరుగా హాజరుకాలేకపోయానని, కానీ త్వరలోనే వరంగల్ నగరానికి వస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్