అమ్మవారిపేటలో తల్లుల వనప్రవేశం

వరంగల్ నగరంలోని దామెర గుట్టల వద్ద జరిగిన అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతర తల్లుల వన ప్రవేశంతో ముగిసింది. జాతర ముగింపు సందర్భంగా, సమ్మక్క సారలమ్మ పూజారులకు జాతర ధర్మకర్తలు వొడి బాల బియ్యం సమర్పించారు. అనంతరం పూజారులు గద్దెలపై ఉన్న సమ్మక్క సారలమ్మలను వనంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ కోడూరు బిక్షపతి, దాసి రాందేవ్, బైరి నాగరాజు, అవునురి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్