హన్మకొండలోని ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలోని ఆసియా ఖండంలోని 2వ అతిపెద్ద చర్చి అయిన క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రవక్తలు పాల్సన్ రాజ్, ప్రకాశ్ అయ్య గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో, 'పాతవి గతించెను క్రొత్తవి మొదలైనవి' అని ప్రవక్త పాల్సన్ అయ్యగారు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు.