ఎంజీఎంలో తనిఖీలు నిర్వహిస్తున్న NMC బృందం

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తోంది. పీజీ సీట్ల మంజూరుకు సంబంధించి వివిధ విభాగాల్లోని మౌలిక సదుపాయాలు, ప్రొఫెసర్ల లభ్యతను అధికారులు పరిశీలిస్తున్నారు. బుధవారం ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో తనిఖీలు పూర్తి చేసిన బృందం, గురువారం కూడా ఎంజీఎం లో తనిఖీలు కొనసాగిస్తూ, కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా సందర్శించింది.

సంబంధిత పోస్ట్