డబ్బు కోసం హన్మకొండ లో లో బాలుడిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, సోమవారం కిడ్నాప్ కు గురైన బాలుడిని తల్లికి అప్పగించారు. అనంతరం హన్మకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. డబ్బు కోసమే బాలుడిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని అన్నారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.