PRGTA హనుమకొండ జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు

ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ PRGTA ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉపాధ్యాయులతో జిల్లా కమిటీ నిర్మాణ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని యాజమాన్య గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు, హక్కులు, సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా 24 మంది సభ్యులతో PRGTA హనుమకొండ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. నూతన కమిటీకి అధ్యక్షులుగా B. స్టాన్లీ డెంజిల్, ప్రధాన కార్యదర్శిగా K. జీవన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగాVVS. చలపతిరావు, R. రవీందర్, అసోసియేషన్ అధ్యక్షులుగా స్వప్న లను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕