దేవాదాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులు, ఇతర సిబ్బందికి సంపూర్ణ ప్రయోజనాలు, హక్కులు దక్కుతాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు. సచివాలయంలో గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 కార్యనిర్వహణ అధికారులుగా పదోన్నతి పొందిన 26 మంది ఈవోలకు మంత్రి ప్రమోషన్ ఉత్తర్వులను అందజేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.