ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జూన్ 4వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.