వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల బీఎస్సీ నర్సింగ్ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రిన్సిపల్ ఆదేశాల మేరకు బస్ డీజిల్ డబ్బులు వసూలు చేయాలని జూనియర్ విద్యార్థి ఫోన్ చేసి చెప్పడంతో, హాస్టల్లో ఫోన్ వాడకంపై ఆగ్రహించిన సీనియర్లు ఎంజీఎం ఆసుపత్రి నర్సింగ్ హాస్టల్ వద్ద అతన్ని చుట్టుముట్టి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన విద్యార్థి వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది.