సిద్దాపూర్ గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అందిన సమాచారం మేరకు ఈ దాడి జరిగినట్లు హాసన్ పర్తి సీఐ మహేందర్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో సిద్దాపూర్‌కు చెందిన ముస్కు రవి, ముస్కు శ్రీనివాస్, ముస్కు కిరణ్ ఉన్నారు. వారి వద్ద నుండి రూ. 2,150 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.