వరంగల్ ప్రభుత్వ గెస్ట్ హౌజుల్లో కొండా కుటుంబం దారుణాలు చేసిందని BRS నేత RS ప్రవీణ్ కుమార్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సురేఖ కుటుంబం వరంగల్‌లో ఎంతో మంది అమ్మాయిలు, విద్యార్థుల మీద అఘాయిత్యాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశాడని ఆరోపించారు. మీ ఫామ్‌హౌస్‌లో గోడలే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. 2002లో ఆ కుటుంబం ఘోరాలు భరించలేక నళిన్ ప్రభాకర్ అనే పోలీస్ ఆఫీసర్ హన్మకొండ చౌరస్తాలో కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పారు.