హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రీ స్కూల్ విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శనివారం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని, అంగన్వాడీ కేంద్రాలు పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రీ స్కూల్ తరగతులు, విద్యపై సమీక్ష నిర్వహించారు.