రాష్ట్ర ఈసీ మెంబర్ గా శ్రీరామోజు మోహన చారి నియామకం

అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి, సంఘ బలోపేతం మరియు విశ్వకర్మ సమాజ అభివృద్ధి లక్ష్యంగా వరంగల్ జిల్లా రంగశాయిపేట ప్రాంతానికి చెందిన బ్రహ్మశ్రీ శ్రీరామోజు మోహన చారిని రాష్ట్ర ఈసీ మెంబర్ గా గురువారం రోజున నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న వారి సేవలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది అని తెలిపారు.

సంబంధిత పోస్ట్