ఉమ్మడి వరంగల్ జిల్లాలో సిఐటియు, బిఆర్టియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమకు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని మరియు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15 నుండి రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ నోటీసులను జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అందజేశారు. ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.