వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బదిలీపై వెళ్లిన సన్ ప్రీత్ సింగ్‌కు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాన్ని తాళ్లతో లాగుతూ తమ అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 15 నెలల సేవాకాలంలో అధికారులు, సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదని, వరంగల్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు.