దేశవ్యాప్తంగా జర్నలిస్టుల రక్షణకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధ్యతాయుతమైన వార్తలు, కథనాలపై రాజకీయ కక్షలతో లేదా అవినీతిపరులు పెట్టే అక్రమ కేసులు చెల్లవని స్పష్టం చేసింది. యూట్యూబ్, శాటిలైట్, ప్రింట్ మీడియా జర్నలిస్టులపై నమోదయ్యే కేసుల విషయంలో ఆయా జర్నలిస్టు సంఘాల కమిటీలదే తుది నిర్ణయం. నిబంధనలను అతిక్రమించి అక్రమ కేసులు నమోదు చేసే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది.