రైల్వే క్వార్టర్స్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

కాజీపేట: భట్టుపల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల రైల్వే ఉద్యోగి మగిని దయాకర్ కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహంపై గాయాలున్నట్లు సమాచారం. పోలీసులు మృతుడి కుటుంబ సభ్యుల కాల్ డేటాను, గత వారం రోజులుగా జరిగిన ఫోన్ సంభాషణలను విశ్లేషిస్తున్నారు. ఆన్‌లైన్ మనీ ట్రాన్సాక్షన్స్, సీసీ కెమెరా ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంపై ఆరా తీస్తున్న పోలీసులు, మృతికి గల అసలు కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్