వృద్ధ మహిళ అనుమానాస్పద మృతి

వరంగల్ మండలం పైడిపెల్లికి చెందిన వృద్ధురాలు ఎర్రముత్యాల సమ్మక్కను ఆమె దత్తత కుమారుడు రమేష్ పోషించకపోవడంతో, వృద్ధురాలు RDO వరంగల్ వద్ద దావా వేసింది. RDO ఆదేశాలతో రమేష్ తల్లిని పోషించడానికి జులైలో పెద్దపల్లికి తీసుకెళ్లాడు. సోమవారం రాత్రి తల్లి మృతదేహంతో పైడిపెల్లికి వచ్చాడు. తల్లి మృతదేహంపై గాయాలుండటంతో, కుమార్తెలు అనుమానం వ్యక్తం చేస్తూ పెద్దపెల్లి PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టంకు తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕