హన్మకొండ అదాలత్ సర్కిల్ లోని ఇగ్లు ఐస్ క్రీమ్ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించకుండా, తయారీ, గడువు తేదీలు ముద్రించకుండా, లైసెన్స్ లేకుండా తయారుచేసి అమ్మకానికి సిద్ధంగా నిల్వచేసిన దాదాపు 4 రకాల, రూ. 1, 13, 525 ఐస్ క్రీమ్ ఉత్పత్తులను మంగళవారం రాత్రి వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాపర్టీతో పాటు తదుపరి చర్య నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారికి అప్పగించారు.