పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి: 11 మంది అరెస్ట్

హంటర్ రోడ్‌లోని లోటస్ రెసిడెన్సీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న జూద స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఏసీపీ మధుసూదన్ నేతృత్వంలోని బృందం పేకాట ఆడుతున్న 11 మంది జూదరులను అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి రూ. 31,440 నగదు, 11 సెల్‌ఫోన్లు, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను, సొత్తును తదుపరి విచారణ నిమిత్తం సుబేదారి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్