వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈనెల 6వ తేదీన కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ, వరంగల్ బల్దియా ముందు ఈ ఆందోళన జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఇన్‌వార్డ్ సెక్షన్‌లో ఉన్న అద్దాలను ధ్వంసం చేయడంతో మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదని వినయ్ భాస్కర్ ఈ సందర్భంగా తెలిపారు.