హనుమకొండలో ఉద్రిక్తత: ఐకేపీ సెంటర్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

హనుమకొండ జిల్లా, హాసన్ పర్తి మండలం మడిపెల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మడిపెల్లి గ్రామానికి చెందిన రైతు ముంజ శ్రీను గౌడ్ (45) నాలుగు రోజులుగా తన వడ్ల పంటను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అధికారులు స్పందించకపోవడంతో, అప్పుల బాధలు తాళలేక శ్రీను గౌడ్ కొనుగోలు కేంద్రం వద్ద ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనతో కొనుగోలు కేంద్రం వద్ద తీవ్ర కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్