పేరుకే 'సీఎం వరంగల్ పర్యటన' అంత హనుమకొండ లోనే

ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన కేవలం పేరుకే అని, క్షేత్ర పర్యటన అంతా హనుమకొండలోనే జరిగిందని వరంగల్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీఎం షెడ్యూల్‌లో ఉన్నవన్నీ హనుమకొండ ప్రాంతాలేనని, వరంగల్‌లో కేవలం ఏరియల్ సర్వే మాత్రమే చేశారని వారు విమర్శిస్తున్నారు. వరంగల్ తూర్పులోని మైసయ్య నగర్, శివనగర్, కరీంబాద్, లెనిన్ నగర్ వంటి ప్రాంతాలు నీట మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, అక్కడికి వెళ్లి తమ సమస్యలను తెలుసుకోవాలని ప్రజలు వాపోయారు.

సంబంధిత పోస్ట్