అర్దరాత్రి పెట్రోల్ బంకుల వద్ద వాహనాల సందడి

హనుమకొండ, వరంగల్, కాజీపేటతో పాటు వివిధ జిల్లాల్లోని పెట్రోల్ బంకుల వద్ద ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, టిప్పర్లు రాత్రి వేళలో బారులు తీరాయి. వారం రోజులకు సరిపడా అమ్మాల్సిన పెట్రోల్, డీజిల్ కేవలం 3-4 గంటల్లోనే ఖాళీ కావడంతో పలు బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు పెట్టారు. బంకులు మూతపడుతున్నాయన్న ప్రచారంతో, స్టాక్ ఉన్న బంకుల వద్ద ప్రజలు వాహనాలతో గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. కొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ లేదా డీజిల్ మాత్రమే అందుబాటులో ఉంది.

సంబంధిత పోస్ట్