వరంగల్ కోటలో కాకతీయ కళా వైభవం

అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జూన్ 14న (ఆదివారం) సాయంత్రం 3 గంటలకు వరంగల్ కోట ఖుష్ మహల్ వద్ద ‘కాకతీయ మహా సంగీత & నృత్య కళా వైభవం’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వేయి మందితో 6 నిమిషాల నృత్య ప్రదర్శన ద్వారా ‘కాకతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్’ నెలకొల్పే ప్రయత్నం జరుగుతుంది. సామూహిక రామాదాసు కీర్తనల గానం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ, అతిథులుగా కుడా చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, నటుడు సుమన్ హాజరవుతారు. నిర్వాహకులు కామిశెట్టి రాజు పటేల్ ఈ వివరాలను వెల్లడించి, అందరినీ ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్