ములుగు: మంత్రి సీతక్కపై వచ్చిన ప్రకటన మాది కాదు: మావోయిస్టు కమిటీ

ఆదివాసీల హక్కులను మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదంటూ June 26న విడుదలైన ప్రకటనతో తమకు సంబంధం లేదని మావోయిస్టు తెలంగాణ కమిటీ శనివారం స్పష్టం చేసింది. మావోయిస్టు దామోదర్ లొంగిపోతున్నట్లు వచ్చిన వార్తలూ అవాస్తవమని, పోలీసులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ప్రకటన విడుదల చేసింది. మావోల సమాచారం కోసం ములుగు, భద్రాద్రి, అసిఫాబాద్ జిల్లాల్లో ఆదివాసీలను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించింది.

సంబంధిత పోస్ట్