ఆ పొలంలో బంగారం దొరుకుతోంది!

వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం కోపాకులపాడులో ఒక రైతుకు చెందిన 6 ఎకరాల భూమిలో దాదాపు 50 తులాల బంగారం దొరికింది. ఈ నెల 24న కలుపు తీస్తున్న కూలీలకు ఈ బంగారం లభించింది. ఈ భూమి యజమానికి గతంలో కూడా బంగారం దొరికినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రాచీన ఆలయాలు ఉన్నాయని, దీంతో ఈ భూమిని కౌలుకు ఇవ్వాలని కొందరు రైతులు యజమానిని కోరుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్