ర్యాగింగ్ జరగలేదు.. గొడవ పడ్డారు

వరంగల్ బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ జరగలేదని, ఇద్దరు విద్యార్థినులు ఫోన్ విషయంలో గొడవ పడ్డారని, వెంటనే వారికి నచ్చజెప్పి వివాదం లేకుండా చేశామని కళాశాల ప్రిన్సిపాల్ సునీత తెలిపారు. ర్యాగింగ్ ఆరోపణల నేపథ్యంలో షీ టీం ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థులంతా కలిసిమెలిసి ఉండాలని, చదువుపై శ్రద్ధ పెట్టి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్