బొగత జలపాతం వద్ద పర్యాటకుల వెలవెల

తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి ఆశించిన స్థాయిలో లేదు. జలపాతంలో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఆదివారం కూడా కొద్ది సంఖ్యలోనే సందర్శకులు వచ్చారు. వచ్చిన కొద్దిమంది పర్యాటకులు తక్కువ నీటిలో ఈత కొడుతూ ఆనందించారు. భారీ వర్షాలు కురిసి, జలపాతంలో నీటి ప్రవాహం పెరిగితేనే ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్