హనుమకొండ పోలీసులు తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వీరి నుండి 10 లక్షల రూపాయల విలువైన 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, మొబైల్ ఫోన్లు, వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు హనుమకొండకు చెందిన బింగి రఘు @ సోనూ, మహమ్మద్ అసద్ అని పోలీసులు గుర్తించారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడించారు.