చారిత్రక ఓరుగల్లు నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సుల కోసమే తాను ఇక్కడికి వచ్చానని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారని గుర్తుచేశారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం వేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తోందని ఆయన స్పష్టం చేశారు.